Health: ఆరోగ్య సంరక్షణలో నూతన అధ్యాయం..
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:30 PM
ఆరోగ్య సేవల సంస్థ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ తమ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది.
హైదరాబాద్: ఆరోగ్య సేవల సంస్థ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ తమ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. భవిష్యత్‌లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది. 'కేర్. ఫర్ గుడ్' అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా, నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, అన్ని విభాగాల మధ్య సమన్వయంపై దృష్టి పెడతామని తెలిపింది.
ఈ సందర్భంగా నిర్వహించిన 'ఫ్యూచర్ హెల్త్.నౌ' సదస్సులో మలేసియా ఆరోగ్య మంత్రి హాజీ జుల్కేఫ్లీ అహ్మద్ మాట్లాడుతూ.. IHH వంటి సంస్థలు ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, ఆవిష్కరణలకు తోడ్పడుతున్నాయని ప్రశంసించారు.