IDBI Bank Privatization: ఐడీబీఐ రేసులో కోటక్ ముందంజ
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:04 AM
కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ ప్రధాన వాటాదారులుగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు బరిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ ప్రధాన వాటాదారులుగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు బరిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ప్రేమ్ వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్, ఓక్‌ట్రీ క్యాపిటల్ సైతం పోటీలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా (2026 మార్చి 31 నాటికి) ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యాంక్‌లో కేంద్రం 45.48ు, ఎల్‌ఐసీ 49.24ు వాటా కలిగి ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా బ్యాంక్‌లో మొత్తం 61ు వాటాను విక్రయించనుంది. అనంతరం బ్యాంక్‌లో కేంద్రం 15ు, ఎల్‌ఐసీ 19ు మేర వాటాలు కలిగి ఉండే అవకాశం ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కె ట్ విలువ రూ.లక్ష కోట్ల పైమాటే. ఈ విలువ ప్రకారంగా, 60ు వాటా కొనుగోలుకు రూ.60,000 కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..