Share News

హైదరాబాద్‌లో ది కాస్‌కేడ్స్‌ నియోపోలిస్‌

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:35 AM

జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్‌ రియల్టీ జాయింట్‌ వెంచర్‌ సంస్థ.. జీహెచ్‌ఆర్‌ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్‌ ఇన్‌ఫ్రా.. హైదరాబాద్‌, కోకాపేట్‌లో ది కాస్‌కేడ్స్‌ నియోపోలిస్‌ పేరుతో...

హైదరాబాద్‌లో ది కాస్‌కేడ్స్‌ నియోపోలిస్‌

జీహెచ్‌ఆర్‌ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్‌ రియల్టీ జాయింట్‌ వెంచర్‌ సంస్థ.. జీహెచ్‌ఆర్‌ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్‌ ఇన్‌ఫ్రా.. హైదరాబాద్‌, కోకాపేట్‌లో ది కాస్‌కేడ్స్‌ నియోపోలిస్‌ పేరుతో మెగా లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నియోపోలి్‌సలో 7.34 ఎకరాల విస్తీర్ణంలో 63 ఫ్లోర్లతో కూడిన ఐదు టవర్లు, మొత్తం 1,189.. 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ డెసిగ్నేటెడ్‌ భాగస్వామి కర్తీశ్‌ రెడ్డి వెల్లడించారు. రూ.3,169 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ 2030 నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుందన్నారు. 2,560 చదరపు అడుగుల నుంచి 4,825 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్స్‌ అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌బీఐ రూ.900 కోట్ల నిధులను సమకూర్చిందని సంస్థ డెసిగ్నేటెడ్‌ భాగస్వాములు లక్ష్మీ నారాయణ, శరత్‌ వెల్లడించారు.

63 ఫోర్లతో మెగా లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌

  • ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ తయారీదారు ఓబెన్‌ ఎలక్ట్రిక్‌ సిరీ్‌స-ఏ ఫండింగ్‌లో భాగంగా మొత్తం రూ.100 కోట్లు సమీకరించింది. ఇందులో భాగంగా జనవరి నెలలో రూ.50 కోట్లు సమీకరించగా మే నెలలో మరో రూ.50 కోట్ల నిధులను సేకరించింది. హీలియోస్‌ హోల్డింగ్స్‌, శారద ఫ్యామిలీ ఆఫీస్‌, కే ఫ్యామిలీ నుంచి ఈ మొత్తాలను సమీకరించింది. తాజా నిధులతో కంపెనీ ఇప్పటి వరకు సమీకరించిన నిధులు రూ.200 కోట్లకు చేరాయి.

  • టెక్స్‌టైల్‌ రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గాను జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌సడీసీ)తో వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.425 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సంయుక్తంగా సర్టిఫికెట్‌ జారీ చేయనున్నాయి. వెల్‌స్పన్‌ తన టెక్స్‌టైల్‌ యూనిట్లలో వీరికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 20 , 2025 | 05:36 AM