Share News

అంతర్జాతీయ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - May 15 , 2025 | 03:32 AM

జీవ శాస్త్రాలు (లైఫ్‌ సైన్సెస్‌), ఆ రంగాలకు చెందిన తయారీ కంపెనీల కేంద్రంగా హైదరాబాద్‌ ఎదుగుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే 18 దేశాలకు చెందిన...

అంతర్జాతీయ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల హబ్‌గా హైదరాబాద్‌

సీబీఆర్‌ఈ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీవ శాస్త్రాలు (లైఫ్‌ సైన్సెస్‌), ఆ రంగాలకు చెందిన తయారీ కంపెనీల కేంద్రంగా హైదరాబాద్‌ ఎదుగుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే 18 దేశాలకు చెందిన 200కుపైగా బయోటెక్‌, ఫార్మా కంపెనీలు కొలువుతీరాయి. బయోటెక్‌ రంగానికి చెందిన టాప్‌-10 పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కంపెనీల్లో ఆరు కంపెనీలు ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో తమ యూనిట్లు ఏర్పాటు చేశాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ‘గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ అట్లాస్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలిపింది. అంతేకాకుండా 20కి పైగా లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టెక్నాలజీ ఇంక్యుబేటర్స్‌ ఇక్కడ ఉన్నాయని పేర్కొంది. కాగా గత ఏడాది భారత్‌లో లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలు లీజుకు తీసుకున్న స్థూల కార్యాలయ స్థలం 56 శాతం వృద్ధితో 58 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని సీబీఆర్‌ఈ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ 200కు పైగా గ్లోబల్‌ బయోటెక్‌, ఫార్మా కంపెనీలతో కీలకంగా ఉందని పేర్కొంది.


అంతేకాకుండా ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో లైఫ్‌ సైన్సెస్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాల్లో హైదరాబాద్‌, బీజింగ్‌, షాంఘై, గ్రేటర్‌ టోక్యో కీలకంగా ఉన్నాయని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. కాగా ప్రతిపాదిత ఫార్మా సిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కులతో ఈ రంగంలో హైదరాబాద్‌ మరింత దూసుకుపోతుందని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 03:32 AM