Honda Cars India: మరిన్ని ఎస్‌యూవీలు తెస్తాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:43 AM
భారత మార్కెట్లోకి మరిన్ని ఎస్‌యూవీలు తీసుకురావాలని భావిస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా తెలిపింది. కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకాషి నకజిమా మాట్లాడుతూ..
అమెరికా, జపాన్‌తో పాటు భవిష్యత్ వృద్ధికి తమకు భారత్ కీలక మార్కెట్ అని అన్నారు. భారత మార్కెట్లో ఎస్‌యూవీల అమ్మకాలు జోరుగా ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన చెప్పారు. భారత్‌లో తమ టూవీలర్ విభాగం ఇప్పటికే అతిపెద్ద వ్యాపారమని, బ్రాండ్, అమ్మకాలు రెండూ పెంచడం ద్వారా కార్ల మార్కెట్లో కూడా అదే తరహాలో బలం పుంజుకోవాలనుకుంటున్నామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కొత్త ఎస్‌యూవీలు ప్రవేశపెట్టాలనుకుంటున్నామంటూ వాటిలో హైబ్రిడ్, బ్యాటరీ మోడళ్లుంటాయని తకాషి తెలిపారు.