Real Estate: జోరుగా ఇళ్ల అమ్మకాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:56 AM
హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన ...
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 1.93 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సంఖ్యాపరంగా ఇళ్ల అమ్మకాలు 34,000 తగ్గాయి. అయితే విలువపరంగా చూస్తే మాత్రం అమ్మకాలు 7 శాతం పెరిగా యి. అమ్ముడైన ఇళ్ల సంఖ్య తగ్గినా, సగటు అమ్మకం విలువ పెరగడంతో గత ఆరు నెలల్లో మార్కెట్ కోలుకుంది. అమ్మకాల జోరు ఇలానే కొనసాగితే మార్చి ముగిసే నాటికి అమ్మకాల విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరుతుందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. హైదరాబాద్‌లో నివాస గృహాల మార్కెట్ మరింత జోరుగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు. నగరంలో పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఇన్వెస్టర్ల నమ్మకం, మిడ్ టు హై ఎండ్ ఇళ్లకు పెరుగుతున్న గిరాకీ ఇందుకు ప్రధాన కారణం.