Share News

Home Loans: 7.15శాతం వడ్డీకే గృహ రుణాలు

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:28 AM

గృహ రుణాలపై వడ్డీ రేట్ల కోత కొనసాగుతోంది. తాజాగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కూడా ఈ జాబితాలో చేరింది. మంచి పరపతి స్కోరు ఉన్న గృహ కొనుగోలుదారులకు...

Home Loans: 7.15శాతం వడ్డీకే గృహ రుణాలు

న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల కోత కొనసాగుతోంది. తాజాగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కూడా ఈ జాబితాలో చేరింది. మంచి పరపతి స్కోరు ఉన్న గృహ కొనుగోలుదారులకు కొత్తగా ఇచ్చే గృహ రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటును 7.15 శాతానికి తగ్గించింది. సోమవారం నుంచే ఈ తగ్గింపు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 5న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానంలో ఆర్‌బీఐ కీలక రెపో వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. దాంతో బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు వరుసపెట్టి తమ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.

Updated Date - Dec 23 , 2025 | 03:28 AM