టాప్‌గేర్‌లో హీరో మోటో లాభాలు
ABN , Publish Date - May 14 , 2025 | 04:53 AM
ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ నాలుగో త్రైమాసికానికి రూ.1,169 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ నాలుగో త్రైమాసికానికి రూ.1,169 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.9,794 కోట్ల నుంచి రూ.10,244 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాలు బాగుండంతో వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.65 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఇది 3,250 శాతానికి సమానం.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..