Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లివో యోగర్ట్
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:07 AM
డెయిరీ దిగ్గజం హెరిటేజ్ ఫుడ్స్ ఆరోగ్య చైతన్యం అధికంగా గల యువతనుద్దేశించి లివో యోగర్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డెయిరీ దిగ్గజం హెరిటేజ్ ఫుడ్స్ ఆరోగ్య చైతన్యం అధికంగా గల యువతనుద్దేశించి లివో యోగర్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. నిరంతరం ఎక్కడో అక్కడికి తిరుగుతూ మెరుగైన స్నాకింగ్ ప్రత్యామ్నాయం కావాలనుకునే యువతకు ఇది చక్కని, రుచికరమైన ఆహారమని కంపెనీ తెలిపింది.
మంచి ఫ్లేవర్, పోషకాహార విలువలు, సౌకర్యవంతం అయిన ఈ యోగర్ట్ రిటైలింగ్ దిగ్గజాలైన విజేత, రత్నదీ్‌పలలో అందుబాటులో ఉంటుంది. 90 గ్రాముల కప్పు విలువ రూ.30గా నిర్ణయించారు. క్లాసిక్ వేరియెంట్ ధర రూ.40. స్ట్రాబెర్రీ, బ్లూబెరీ, మామిడి ఫ్లేవర్లలో ఇది లభిస్తుంది.