Share News

యూపీలో హెచ్‌సీఎల్‌ ఫాక్స్‌కాన్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - May 15 , 2025 | 03:21 AM

హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ సెమీకండక్టర్ల రంగంలోకి ప్రవేశిస్తోంది. తైవాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో కలిసి రూ.3,706 కోట్ల పెట్టుబడితో ఇందుకోసం...

యూపీలో హెచ్‌సీఎల్‌ ఫాక్స్‌కాన్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ సెమీకండక్టర్ల రంగంలోకి ప్రవేశిస్తోంది. తైవాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో కలిసి రూ.3,706 కోట్ల పెట్టుబడితో ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌ వద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. 2027 కల్లా ఉత్పత్తి ప్రారభించే ఈ ప్లాంట్‌ ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఈ ప్లాంటులో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, ఆటోమొబైల్స్‌లో వినియోగించే డిస్‌ప్లే డ్రైవర్‌ చిప్స్‌ తయారవుతాయని చెప్పారు.

Updated Date - May 16 , 2025 | 11:11 PM