Share News

GST Revenue: జీఎస్‌టీ వసూళ్లు ఐదేళ్లలో రెట్టింపు

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:36 AM

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎ్‌సటీ వార్షిక వసూళ్లు గడిచిన ఐదేళ్లలో రెట్టింపయ్యాయి.

 GST Revenue: జీఎస్‌టీ వసూళ్లు ఐదేళ్లలో రెట్టింపు

  • గత ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎ్‌సటీ వార్షిక వసూళ్లు గడిచిన ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.11.37 లక్షల కోట్లుగా నమోదుకాగా.. గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.22.08 లక్షల కోట్లకు పెరిగాయి. మరిన్ని విషయాలు..

  • 2024-25లో జీఎ్‌సటీ ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2023-24)తో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందాయి.

  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ వసూళ్ల సగటు రూ.95,000 కోట్లుగా నమోదుకాగా.. 2021-22లో రూ.1.51 లక్షల కోట్లకు, రూ. 2023-24లో రూ.1.68 లక్షల కోట్లకు, 2024-25లో రూ.1.84 లక్షల కోట్లకు పెరిగాయి.

  • జీఎస్‌టీ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌)లో నమోదు చేసుకున్న వ్యాపారులు (పన్ను చెల్లింపుదారులు) గడిచిన 8 ఏళ్లలో రెట్టింపునకు పైగా పెరిగారు. 2017లో వీరి సంఖ్య 65 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం 1.51 కోట్లు దాటింది.

  • ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరాయి. 2025 మే నెలలో రూ.2.01 లక్షల కోట్లుగా నమోదు కాగా.. జూన్‌ గణాంకాలు మంగళవారం విడుదల కానున్నాయి.

  • దేశవ్యాప్తంగా ఏకరీతి పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేసేందుకు 17 రకాల స్థానిక పన్నులు, 13 రకాల సుంకాల విలీనం ద్వారా రూపొందించిన జీఎస్‌టీ చట్టం 2017 జూలై 1న అమలులోకి వచ్చింది.

Updated Date - Jul 01 , 2025 | 02:38 AM