Share News

జీఆర్‌టీ నుంచి గోల్డెన్‌ ఎలెవెన్‌ ఫ్లెక్సీ ప్లాన్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:33 AM

ఆభరణాల రిటైలింగ్‌ దిగ్గజం జీఆర్‌టీ జువెలర్స్‌ తమ కస్టమర్ల కోసం గోల్డెన్‌ ఎలెవెన్‌ ఫ్లెక్సీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది 11 నెలల పాటు బంగారంపై పెట్టుబడి పెట్టే ఆకర్షణీయమైన ప్లాన్‌...

జీఆర్‌టీ నుంచి గోల్డెన్‌ ఎలెవెన్‌ ఫ్లెక్సీ ప్లాన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆభరణాల రిటైలింగ్‌ దిగ్గజం జీఆర్‌టీ జువెలర్స్‌ తమ కస్టమర్ల కోసం గోల్డెన్‌ ఎలెవెన్‌ ఫ్లెక్సీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది 11 నెలల పాటు బంగారంపై పెట్టుబడి పెట్టే ఆకర్షణీయమైన ప్లాన్‌. కనీస పెట్టుబడి రూ.1000. ఆ పైన ఎంత మొత్తంలో అయినా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. వారు 11 నెలల అనంతరం తమకు ఇష్టమైన ఆభరణాలు కొనుగోలు చేయవచ్చునని జీఆర్‌టీ జువెలర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి బరువు ఆధారిత ప్లాన్‌ కాగా రెండోది విలువ ఆధారిత ప్లాన్‌. ఈ రెండింటిలో ఏదో ఒకటి కస్టమర్‌ ఎంచుకోవచ్చు. 18 శాతం వరకు ఎలాంటి తరుగు వసూలు చేయకపోవడం ఈ ప్లాన్‌ ప్రత్యేకత. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలన్నింటికీ ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. బంగారం ధరలు భారీ ఆటుపోట్లకు గురవుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇది కస్టమర్ల సొమ్ముకు విలువ చేకూర్చే చక్కని ప్లాన్‌ అని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ ‘ఆనంద్‌’ అనంత పద్మనాభన్‌ అన్నారు.


నెలవారీ వాయిదా ఎంపిక నుంచి ఎప్పటికప్పుడు చెల్లింపులకు సంబంధించిన అలర్ట్‌లు జారీ చేయడం వరకు అన్నింటిలోనూ తమ నిపుణులు కస్టమర్లకు మార్గదర్శకం చేస్తారని చెప్పారు. జన్మదినాలు, ఇతరత్రా వేడుకల సమయంలో కుటుంబ సభ్యులకు ఆకర్షణీయమైన బహుమతులు ప్లాన్‌ చేసేందుకు ఇది చక్కని అవకాశమని మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ రాధాకృష్ణన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 04:33 AM