Share News

Nifty 50: 2026 డిసెంబరు నాటికి నిఫ్టీ 29,000

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:57 AM

అంతర్జాతీయ బ్రోకరేజీ సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మన మార్కెట్‌ రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌...

Nifty 50: 2026 డిసెంబరు నాటికి నిఫ్టీ 29,000

అంతర్జాతీయ బ్రోకరేజీ సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ భారత స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మన మార్కెట్‌ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్‌’ స్థాయికి పెంచింది. 2024 అక్టోబరులో రేటింగ్‌ను తటస్థ స్థాయికి తగ్గించిన గోల్డ్‌మన్‌ శాక్స్‌.. 13 నెలలకే మళ్లీ తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. అంతేకాదు, నిఫ్టీ-50 సూచీ 2026 డిసెంబరు నాటికి 29,000 స్థాయికి ఎగబాకవచ్చని అంచనా వేసింది. గత వారాంతం స్థాయితో పోలి స్తే ఇది 14 శాతం అధికం. ప్రభుత్వ విధానాల సడలింపు, పెరుగుతున్న ఆదాయం, ఇన్వెస్టర్లలో మెరుగైన సెంటిమెంట్‌ ఇందుకు దోహదపడనున్నాయని తాజా నోట్‌లో పేర్కొంది. ఆర్థిక సేవలు, వినియోగం, రక్షణ, ఇంధన విక్రయ రంగ సంస్థలు వచ్చే ఏడాది కాలంలో మెరుగైన పనితీరు కనబరచవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రస్తావించింది. దేశీయ గిరాకీ, మూలధన వ్యయాలు, కార్పొరేట్ల బలమైన బ్యాలెన్స్‌షీట్లు ఇందుకు తోడ్పడనున్నాయని అంటోంది.

3 రోజుల తర్వాత లాభాల్లోకి.. సెన్సెక్స్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాల నుంచి కాస్త తేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీతో పాటు ఐటీ, ఆర్థిక సేవల రంగాల షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక సూచీలు సోమవారం ఒక మోస్తరుగా లాభపడ్డాయి. ఒక దశలో 538.21 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌.. చివరికి 319.07 పా యింట్ల లాభంతో 83,535.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82.05 పాయింట్ల వృద్ధితో 25,574.35 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ షేరు 2.52 శాతం లాభపడి సూచీ టాప్‌ గెయిరన్‌గా నిలిచింది.

లెన్స్‌కార్ట్‌ లిస్టింగ్‌..ప్చ్‌!

లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ ఏకంగా 28.26 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ను దక్కించుకున్నప్పటికీ లిస్టింగ్‌ మాత్రం నిరాశపరిచింది. ఐపీఓ ధర రూ.402తో పోలిస్తే, బీఎ్‌సఈలో ఈ షేరు 2.98ు నష్టంతో రూ.390 వద్ద లిస్టయింది. ఒక దశలో 11.52ు వరకు క్షీణించినప్పటికీ, వెంటనే కోలుకుని 2.93ు వరకు పెరిగింది. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి కేవలం 0.32 శాతం లాభంతో రూ.403.30 వద్ద స్థిరపడింది.

Updated Date - Nov 11 , 2025 | 01:57 AM