Share News

Goldman Sachs: గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఎండీలుగా 49 మంది భారతీయులకు పదోన్నతి

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:11 AM

ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రపంచవ్యాప్తంగా మేనేజింగ్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించిన 638 మందిలో 49 మంది భారతీయులున్నారు. ఈ 49 మందిలో ఐదుగురు...

Goldman Sachs: గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఎండీలుగా 49 మంది భారతీయులకు పదోన్నతి

హైదరాబాద్‌లో ఐదుగురికి..

న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రపంచవ్యాప్తంగా మేనేజింగ్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించిన 638 మందిలో 49 మంది భారతీయులున్నారు. ఈ 49 మందిలో ఐదుగురు హైదరాబాద్‌ కార్యాలయంలో పదోన్నతి పొందారు. మిగతా వారిలో ఆరుగురు ముంబై కార్యాలయంలోను, 38 మంది బెంగళూరు కార్యాలయంలో ఉన్నారు. .మన దేశం నుంచి ఒకేసారి ఇంత మందికి పదోన్నతి కల్పించడం ఇదే ప్రథమం. అంతేకాదు.. న్యూయార్క్‌, లండన్‌ కార్యాలయాల తర్వాత అధిక సంఖ్యలో పదోన్నతులు లభించింది బెంగళూరు కార్యాలయంలోనే. 2023లో 35 మందికి పదోన్నతి కల్పించారు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం దేశంలో గల అపారమైన పెట్టుబడి అవకాశాలకు సూచిక అని కంపెనీ పేర్కొంది. మన దేశంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ 8,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా 46,000 మంది పని చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 06:11 AM