Share News

Gold: పసిడి ధర మరింత ముందుకే

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:41 AM

పసిడి ధర ఈ వారం మరింత ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నట్టు విశ్లేషకుల అంచనా. గత వారం ప్రారంభంలో ఎంసీఎక్స్‌లో రూ.94,951 వద్ద ప్రారంభైన 10 గ్రాముల మేలిమి బంగారం...

Gold: పసిడి ధర మరింత ముందుకే

త్వరలోనే మళ్లీ రూ.లక్షకు

ముంబై: పసిడి ధర ఈ వారం మరింత ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నట్టు విశ్లేషకుల అంచనా. గత వారం ప్రారంభంలో ఎంసీఎక్స్‌లో రూ.94,951 వద్ద ప్రారంభైన 10 గ్రాముల మేలిమి బంగారం ధర, వారాంతానికి రూ.97,830 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్‌ (31.10 గ్రాము లు) పసిడి ధర 2.8 శాతం పెరిగింది. గత వారం అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఆగస్టులో డెలివరీ ఇచ్చే ఔన్స్‌ బంగారం ధర ఒక దశలో 3,364 డాలర్లకు చేరింది. ప్రస్తు తం స్పాట్‌ మార్కెట్‌లో ఔన్స్‌ పసిడి ధర 3,356.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది త్వరలోనే 3,500 డాలర్లకు చేరే అవకాశం ఉందని ఏంజెల్‌ వన్‌ బ్రోకరేజి సంస్థ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రతమేస్‌ మాల్యా అంచనా. ఎంసీఎక్స్‌లోనూ 10 గ్రాముల పసిడి ధర వచ్చే కొద్ది రోజుల్లో రూ.లక్షకు చేరుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Updated Date - Jul 14 , 2025 | 04:41 AM