Share News

Gold and silver prices: గోల్డ్‌, సిల్వర్‌ సరికొత్త రికార్డు

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:27 AM

విలువైన లోహాల ధరలు సోమవారం సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై...

Gold and silver prices: గోల్డ్‌, సిల్వర్‌ సరికొత్త రికార్డు

  • పది గ్రాముల బంగారం రూ.1.38 లక్షలు

  • రూ.2.14 లక్షలు దాటిన కిలో వెండి రేటు

న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు సోమవారం సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.1,685 పెరిగి రూ.1,38,200కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.10,400 ఎగబాకి రూ.2,14,500కు పెరిగింది. అంతర్జాతీయంగానూ వీటి రేట్లు కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 80.85 డాలర్లు లేదా 1.86 శాతం వృద్ధితో 4,420.35 డాలర్లు పలికింది. సిల్వర్‌ 2.31 డాలర్లు లేదా 3.44 శాతం పెరుగుదలతో 69.45 డాలర్లకు చేరింది. ప్లాటినం కూడా 5.4 శాతం ఎగబాకి 17 ఏళ్లకు పైగా గరిష్ఠ స్థాయి 2,079.25 డాలర్లకు, పల్లాడియం 2.7 శాతం వృద్ధితో దాదాపు మూడేళ్ల గరిష్ఠ స్థాయి 1,759 డాలర్లకు పెరిగింది.

Updated Date - Dec 23 , 2025 | 03:27 AM