జేఏఎల్ కొనుగోలు రేసులో జీఎంఆర్
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:41 AM
దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) కంపెనీని చేజిక్కించుకునేందుకు జీఎంఆర్ గ్రూప్ సహా పలు కార్పొరేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. జేఏఎల్ అస్తుల కొనుగోలుకు...
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) కంపెనీని చేజిక్కించుకునేందుకు జీఎంఆర్ గ్రూప్ సహా పలు కార్పొరేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. జేఏఎల్ అస్తుల కొనుగోలుకు జీఎంఆర్, జేఎ్‌సడబ్ల్యూ, దాల్మియా భారత్, జిందాల్ పవర్, వేదాంత, వెల్‌స్పన్, టొరెంట్ పవర్ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) సమర్పించినట్లు తెలిసింది. తుది గడువు (ఈనెల 25) లోగా అదానీ గ్రూప్ సైతం ఈఓఐ సమర్పించనున్నట్లు సమాచారం. సిమెంట్ ప్లాంట్లు, హోటళ్లు సహా భిన్న వ్యాపారాల్లోకి విస్తరించిన జేఏఎల్ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.17,300 కోట్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంక్‌తోపాటు మరో 21 మంది రుణదాతలకు జేఏఎల్ రూ.48,000 కోట్లకు పైగా బకాయిపడింది.