Share News

Telangana Rythu Mahotsavam: సేంద్రీయ వ్యవసాయం, టెర్రస్‌ గార్డెనింగ్‌కు పర్‌ఫెక్ట్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:23 AM

హైదరాబాద్‌లో జరుగుతున్న రైతు మహోత్సవంలో గ్లోబల్ గ్రీన్ అగ్రినోవా సంస్థ పర్‌ఫెక్ట్‌ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఇది చీడపీడలను తగ్గిస్తూ అధిక దిగుబడికి తోడ్పడుతుంది

Telangana Rythu Mahotsavam: సేంద్రీయ వ్యవసాయం, టెర్రస్‌ గార్డెనింగ్‌కు పర్‌ఫెక్ట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బెంగళూరు కేంద్రంగా ఉన్న గ్లోబల్‌ గ్రీన్‌ అగ్రినోవా.. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ రైతు మహోత్సవంలో తన ‘పర్‌ఫెక్ట్‌’ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. వృక్ష ఆయుర్వేదం ద్వారా తయారు చేయబడిన పర్‌ఫెక్ట్‌ను మొక్కలు, పండ్ల చెట్లకు పిచికారీ చేయటం ద్వారా చీడపీడలను నివారించవచ్చు. అలాగే సేంద్రీయ వ్యవసాయానికి దోహదం చేయటంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని కంపెనీ చైర్మన్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. పర్‌ఫెక్ట్‌ సేంద్రీయ వ్యవసాయానికే కాకుండా నగరాల్లో ఇటీవల ప్రాచుర్యం పొందిన మిద్దె తోటలకు, పెరటి తోటలకు అనువుగా ఉంటుందని అన్నారు. రైతు మహోత్సవంలో డీ-12లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో పర్‌ఫెక్ట్‌ ఉత్పత్తులు వినియోగదారులు నేరుగా పొందవచ్చని మూర్తి తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 03:24 AM