Share News

తగ్గిన గ్లాండ్‌ ఫార్మా లాభం

ABN , Publish Date - May 21 , 2025 | 02:41 AM

గ్లాండ్‌ ఫార్మా.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.186.54 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం...

తగ్గిన గ్లాండ్‌ ఫార్మా లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లాండ్‌ ఫార్మా.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.186.54 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.192.42 కోట్లతో పోల్చితే 3ు తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.1,537.45 కోట్ల నుంచి రూ.1,424.91 కోట్లకు తగ్గింది. అమెరికా మార్కెట్‌ ఆదాయాలు 10ు తగ్గటం పనితీరును దెబ్బతీసిందని పేర్కొంది. ఈ కాలంలో అమెరికా ఆదాయం రూ.791.80 కోట్లుగా ఉంది. మరోవైపు యూరప్‌ ఆదాయాలు 4ు వృద్ధితో రూ.280.20 కోట్లుగా ఉండగా భారత ఆదాయం నిలకడగా రూ.52.5 కోట్లుగా ఉన్నట్లు గ్లాండ్‌ ఫార్మా తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.18 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:41 AM