హైదరాబాద్‌లో ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ యూనిట్
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:53 AM
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరుతోంది. కెనడా కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ ఫిరన్ టెక్నాలజీ గ్రూప్ (ఎఫ్‌టీజీ)...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరుతోంది. కెనడా కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ ఫిరన్ టెక్నాలజీ గ్రూప్ (ఎఫ్‌టీజీ) హైదరాబాద్‌లో తన తయారీ యనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. జీఎంఆర్ ఏరోస్పేస్ సెజ్‌లో 28,000 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) విస్తీర్ణంలో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ యూనిట్‌లో విమానాల కాక్‌పిట్‌లో ఉపయోగించే పరికరాలు, బ్యాక్‌లైట్ ప్యానల్స్ ఇతర అధునాతన పరికరాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. భవిష్యత్‌లో ఈ యూనిట్‌ను మరింత విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్ ఏరోస్పేస్ రంగంలోకి కెనడా నుంచి వచ్చిన తొలి పెట్టుబడి ఇదే కావటం విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..