Share News

వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:27 AM

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులూ వడ్డీ రేట్ల తగ్గింపునకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) తమ...

వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులూ వడ్డీ రేట్ల తగ్గింపునకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), ఇండియన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటు 0.35 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. మిగతా బ్యాంకులూ ఇదే బాటలో నడుస్తాయని భావిస్తున్నారు. తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును ఈ నెల 11 నుంచి 9.05 శాతం నుంచి 8.7 శాతానికి కుదిస్తున్నట్టు ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. పీఎన్‌బీ, బీఓఐ కూడా తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును 9.10 శాతం 8.85 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. యూకో బ్యాంక్‌ కూడా ఇదే బాటలో నడిచింది. తన రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును గురువారం నుంచి 8.8 శాతానికి తగ్గించింది.

Updated Date - Apr 10 , 2025 | 03:27 AM