Share News

యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ గోయల్‌ అరెస్ట్‌

ABN , Publish Date - May 20 , 2025 | 03:34 AM

బ్యాంకు రుణ మోసం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై యూకో బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం వెల్లడించింది...

యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ గోయల్‌ అరెస్ట్‌

మనీలాండరింగ్‌ అభియోగాలపై అదుపులోకి తీసుకున్న ఈడీ

న్యూఢిల్లీ: బ్యాంకు రుణ మోసం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై యూకో బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం వెల్లడించింది. కాన్‌కా్‌స్ట స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (సీఎ్‌సపీఎల్‌), ఇతరులపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా గోయల్‌ను ఈ నెల 16న ఆయన నివాసంలో అరెస్ట్‌ చేసినట్టు పేర్కొంది. 17న కోల్‌కతాలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో గోయల్‌ను హాజరు పరచగా.. మే 21 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించినట్టు తెలిపింది. ఈడీ తన దర్యాప్తులో భాగంగా గత ఏప్రిల్‌లో గోయల్‌తో పాటు మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. గోయల్‌ యూకో బ్యాంక్‌ సీఎండీగా ఉన్నప్పుడు సీఎ్‌సపీఎల్‌కు రూ.6,210.72 కోట్ల రుణాలు మంజూరు చేయగా ఆ సంస్థ ఆ మొత్తాలను దారి మళ్లించినట్టు ఈడీ పేర్కొంది. ప్రతిగా సీఎ్‌సపీఎల్‌ నుంచి గోయల్‌ ముడుపులు అందుకున్నట్టు ఆరోపించింది.


సీఎ్‌సపీఎల్‌కు క్రెడిట్‌ ఫెసిలిటీలను మంజూరు చేయడం, తర్వాత భారీ ఎత్తున రుణ మొత్తాల మళ్లింపునకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 03:34 AM