Entain Technology: హైదరాబాద్‌లో ఎంటైన్ జీసీసీ
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:48 AM
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), లాటిన్ అమెరికాతో సహా 120 పైగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), లాటిన్ అమెరికాతో సహా 120 పైగా దేశాల్లోని క్రీడలు, గేమింగ్ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సేవలందించే ఎంటైన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎంటైన్ ఇండియా ఈ జీసీసీని ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా 3,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని కంపెనీ ఎండీ అంథిల్ అన్భజగన్ చెప్పారు. తమ అంతర్జాతీయ కస్టమర్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సేవల్లో 85 శాతం ఈ జీసీసీ నుంచే అందిస్తామన్నారు. ఎంటైన్ గ్రూప్ ఇప్పటి వరకు మన దేశం నుంచి ఐవీ పేరుతో కార్యకలాపాలు నిర్వహించింది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత అనుబంధ సంస్థ పేరు ను కూడా ఎంటైన్ ఇండియాగా మార్చినట్టు అన్భజగన్ చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం టెక్నాలజీ రంగంలోని పెద్దగా నైపుణ్యాలు అవసరం లేని చిన్న స్థాయి ఉద్యోగాలపై తప్ప ఉన్నత స్థాయి ఉద్యోగాలపై పెద్దగా ఉండదన్నారు.