Hyderabad Tech Company: తగ్గిన ఎంటార్ టెక్నాలజీస్ లాభం
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:09 AM
ఎంటార్ టెక్నాలజీస్ ఆదాయం, లాభాలకు రెండో త్రైమాసికంలో గండి పడింది. రెండో త్రైమాసికంలో కంపెనీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంటార్ టెక్నాలజీస్ ఆదాయం, లాభాలకు రెండో త్రైమాసికంలో గండి పడింది. రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.135.6 కోట్ల ఆదాయంపై రూ.17 కోట్ల స్థూల లాభం, రూ.4.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే క్యు2లో కంపెనీ ఆదాయం రూ.21 కోట్లు, స్థూల లాభం రూ.11.4 కోట్లు, నికర లాభం రూ.6.6 కోట్లు పడిపోయాయి. అయితే మెరుగైన ఆర్డర్లు, ఉత్పాదకత వినియోగంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తామని కంపెనీ ఎండీ, ప్రమోటర్ పర్వత్ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు