Share News

ఈఎంఐలు ఎంత తగ్గుతాయంటే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:35 AM

ప్రస్తుతం బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు మంచి పరపతి స్కోరు ఉన్నవారికి ఇచ్చే 20 ఏళ్ల కాలపరిమితి గృహ రుణాలపై 9 శాతం వరకు కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా వడ్డీ రేటు తగ్గింపుతో ఈ వడ్డీ రేటు...

ఈఎంఐలు ఎంత తగ్గుతాయంటే..

ప్రస్తుతం బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు మంచి పరపతి స్కోరు ఉన్నవారికి ఇచ్చే 20 ఏళ్ల కాలపరిమితి గృహ రుణాలపై 9 శాతం వరకు కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా వడ్డీ రేటు తగ్గింపుతో ఈ వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గనుంది. దీంతో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల గృహ రుణాలపై ఈఎంఐ ఎంత తగ్గనుందంటే..

రూ.30 లక్షల రుణంపై: 20 సంవత్సరాల చెల్లింపు కాలపరిమితి ఉండే రూ.30 లక్షల గృహ రుణంపై నెలనెలా చెల్లించే ఈఎంఐ భారం రూ.26,247 నుంచి రూ.25,071కి తగ్గుతుంది. అంటే నెలకు రూ.1,176 భారం తగ్గుతుంది. ఈ లెక్కన 20 సంవత్సరాలకు వడ్డీ, అసలు చెల్లింపుల రూపంలో రూ.2.82 లక్షలు ఆదా అవుతాయి.

రూ.50 లక్షల రుణంపై: అదే రూ.50 లక్షల గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ భారం రూ.1,960 తగ్గి రూ.43,745 నుంచి రూ.41,785 కు తగ్గుతుంది. అంటే 20 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే సరికి ఆదా అయ్యే సొమ్ము రూ.4.7 లక్షలు.

రూ.70 లక్షల గృహ రుణంపై: తొమ్మిది శాతం వడ్డీ రేటు చొప్పున ప్రస్తుతం చెల్లించే ఈఎంఐ రూ.61,243. వడ్డీ రేటు అర శాతం తగ్గితే చెల్లించే ఈఎంఐ రూ.58,499. అంటే నెలకు రూ.2,744 చొప్పున 20 ఏళ్లలో రూ.6.58 లక్షలు ఆదా అవుతాయి.


రూ.కోటి గృహ రుణంపై: ప్రస్తుతం రూ.కోటి గృహ రుణంపై 9 శాతం వడ్డీ రేటు చొప్పున చెల్లించే ఈఎంఐ రూ.87,490. అదే వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గితే చెల్లించే ఈఎంఐ రూ.83,570 మాత్రమే. అంటే నెలకు రూ.3,920 చొప్పున 20 ఏళ్లలో రూ.9.4 లక్షలు ఆదా అవుతాయి.

రూ.1.5 కోట్ల గృహ రుణంపై: ఈ గృహ రుణంపై 9 శాతం వడ్డీ రేటుతో ప్రస్తుతం నెలనెలా చెల్తిస్తున్న ఈఎంఐ రూ.1,31,235. అదే వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గితే చెల్లించే ఈఎంఐ రూ.1,25,355 మాత్రమే. అంటే నెలకు రూ.5,880 చొప్పున 20 ఏళ్లలో రూ.14.11 లక్షలు ఆదా అవుతాయి.

ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 10 , 2025 | 03:35 AM