DP World Launches First Reefer Rail Service: ఫార్మా ఎగుమతుల కోసం తొలి రీఫర్ రైల్ సర్వీస్
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:16 AM
హైదరాబాద్ సమీపంలోని తిమ్మాపూర్‌లో ఉన్న తమ కేంద్రం నుంచి నవసేవకు (జేఎన్‌పీఏ) తొలి రీఫర్ రైల్ సరకు రవాణా సేవను ఓషియన్ నెట్‌వర్క్ ఎక్స్....
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని తిమ్మాపూర్‌లో ఉన్న తమ కేంద్రం నుంచి నవసేవకు (జేఎన్‌పీఏ) తొలి రీఫర్ రైల్ సరకు రవాణా సేవను ఓషియన్ నెట్‌వర్క్ ఎక్స్‌ప్రెస్ (వన్) సహాయంతో ప్రారంభించినట్టు డీపీ వరల్డ్ తెలిపింది. దీనివల్ల తిమ్మాపూర్ ఐసీడీ నుంచి నవసేవకు రిఫ్రిజిరేటెడ్ రైలు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇది ప్రధానంగా ప్రాంతీయ ఫార్మా ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని, వారికి అవసరమైన లాజిస్టిక్ సొల్యూషన్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ వీక్లీ సర్వీసు ద్వారా 40 అడుగుల నిడివి గల 43 కంటైనర్లను ఒకే రైలు ద్వారా రవాణా చేసే అవకాశం ఉంటుంది.