Share News

రక్షణ షేర్లలో కొనసాగిన ర్యాలీ

ABN , Publish Date - May 15 , 2025 | 03:09 AM

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ రక్షణ రంగ షేర్లలో బుల్‌ ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో మిశ్ర ధాతు నిగమ్‌ (మిధానీ) స్టాక్‌...

రక్షణ షేర్లలో కొనసాగిన ర్యాలీ

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ రక్షణ రంగ షేర్లలో బుల్‌ ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో మిశ్ర ధాతు నిగమ్‌ (మిధానీ) స్టాక్‌ ఏకంగా 15.12 శాతం ఎగబాకింది. యాక్సిస్‌కేడ్స్‌ టెక్నాలజీస్‌ 5 శాతం, పారస్‌ డిఫెన్స్‌ 4 శాతం లాభపడ్డాయి. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ 3.47 శాతం, డేటా ప్యాటర్న్స్‌ 2.93 శాతం, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ 2.56 శాతం, అస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ 2.26 శాతం, భారత్‌ డైనమిక్స్‌ 1.16 శాతం పుంజుకున్నాయి. డ్రోన్‌ తయారీదారుల్లో డ్రోనాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ 2 శాతం, ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ 0.86 శాతం పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 03:10 AM