Share News

రియల్‌ మనీ గేమింగ్‌ కంపెనీలకు ప్రవర్తనా నియమావళి

ABN , Publish Date - Mar 11 , 2025 | 02:02 AM

రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) కంపెనీలకు ప్రవర్తనా నియమావళిని నిర్దేశించేందుకు దోహదపడే ఒప్పందంపై ఆ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే...

రియల్‌ మనీ గేమింగ్‌ కంపెనీలకు ప్రవర్తనా నియమావళి

న్యూఢిల్లీ: రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) కంపెనీలకు ప్రవర్తనా నియమావళిని నిర్దేశించేందుకు దోహదపడే ఒప్పందంపై ఆ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే ఏఐజీఎఫ్‌, ఈజీఎఫ్‌, ఎఫ్‌ఐఎ్‌ఫఎస్‌ సంతకాలు చేశాయి. యూజర్ల భద్రతకు, బాధ్యతాయుతమైన గేమింగ్‌ విధానాలకు ఈ చర్య దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈ సంస్థల భాగస్వామ్యంలోని కంపెనీలు కేవైసీ పరిశీలన, ఆన్‌లైన్‌పై గడిపే కాలపరిమితి నియంత్రణకు చర్యలు తీసుకుంటాయి. ఇది 50 కోట్ల మంది పైగా ఆన్‌లైన్‌ గేమర్ల ప్రయోజనాలు పరిరక్షిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిబంధనలు 2023 ఏప్రిల్‌లోనే రూపొందించినప్పటికీ వాటిని ఇంకా అమలు చేయలేదు. ఇదిలా ఉండగా ఈ సంస్థల భాగస్వామ్య కంపెనీల్లో డ్రీమ్‌ 11, మై 11 సర్కిల్‌, ఖేలో ఫ్యాంటసీ లైవ్‌, ఎస్‌జీ11 ఫ్యాంటసీ, వింజో, గేమ్స్‌ 24గీ7, జంగ్లీ గేమ్స్‌ ఉన్నాయి.


ఆర్‌ఎంజీ నియంత్రణకు

తమిళనాడు కఠిన నిబంధనలు

రియల్‌ మనీ గేమ్స్‌ను గతంలో నిషేధించిన తమిళనాడు తాజాగా వాటికి కఠిన నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం ఈ వేదికలపై మైనర్లు ఆడడాన్ని నిషేధించింది. గేమర్లకు వ్యయ నియంత్రణలు విధించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్లాంక్‌ అవర్‌గా ప్రకటించింది. దీని వల్ల ఈ మధ్య కాలంలో ఎవరూ లాగిన్‌ అయ్యే అవకాశం కూడా ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 02:02 AM