Charles Schwab: హైదరాబాద్‌లో చార్లెస్ ష్వాబ్ జీసీసీ
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:55 AM
హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు చార్లెస్ ష్వాబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు చార్లెస్ ష్వాబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. బహుళ జాతి కంపెనీల్లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రదీప్ మీనన్‌ను ష్వాబ్ ఇండియా ఎండీగా నియమించినట్టు తెలిపింది. హైదరాబాద్ కార్యాలయంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ వచ్చే ఏడాది నియామకాల ప్రక్రి య ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.