ఎన్‌ఐఆర్‌ఎంతో సిబీ మైనింగ్ జట్టు
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:20 AM
హైదరాబాద్‌కు చెందిన సిబీ మైనింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం)తో ఒక అవగాహనా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన సిబీ మైనింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం)తో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థ లు గనులు, మౌలిక ప్రాజెక్టుల నిర్మాణంలో అవసరమయ్యే అధునాతన నియంత్రిత పేలుళ్ల టెక్నాలజీలో సహకరించుకుంటాయి. సిబీ మైనింగ్.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెద్దకోట వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసే చిత్రావతి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో ఈ టెక్నాలజీని ఉపయోగించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..