Canara Bank New Rules 2025: కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ రుసుము రద్దు
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:39 AM
కెనరా బ్యాంక్ తన పొదుపు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్‌ఆర్‌ఐ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేసింది. జూన్ 1 నుండి ఇది అమలులోకి రానుంది.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్‌ఆర్‌ఐ సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ చార్జీని రద్దు చేస్తున్నట్లు, జూన్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్లో కనీస నగదును నిర్వహించకపోయినప్పటికీ ఎలాంటి జరిమానా లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. ఇంతక్రితం బ్యాంక్ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను ఉంచాల్సి వచ్చేది. ఖాతాలోని కనీస నిల్వ నెల రోజుల సగటు బ్యాంక్ నిర్దేశిత పరిమితి కంటే తగ్గితే పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది.