Share News

Nirmala Sitharaman: కెనరా బ్యాంక్‌ రూ.2,283.41 కోట్ల డివిడెండ్‌ను అందించింది

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:15 AM

కెనరా బ్యాంక్‌.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రూ.2,283.41 కోట్ల డివిడెండ్‌ను అందించింది.

Nirmala Sitharaman: కెనరా బ్యాంక్‌ రూ.2,283.41 కోట్ల డివిడెండ్‌ను అందించింది

కెనరా బ్యాంక్‌.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రూ.2,283.41 కోట్ల డివిడెండ్‌ను అందించింది. శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ డివిడెండ్‌ చెక్‌ను కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు హర్‌దీప్‌ సింగ్‌ అహ్లువాలియా, భవేంద్ర కుమార్‌, ఎస్‌కే మజుందార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 05:18 AM