Byjus Founder Ravindran Faces: బైజూస్ రవీంద్రన్‌కు భారీ షాక్
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:07 AM
ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫాతో పాటు అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీకి...
ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్‌లకు రూ.10,400 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించిన అమెరికా కోర్టు
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫాతో పాటు అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీకి మొత్తం 116 కోట్ల డాలర్లు (రూ.10,400 కోట్లు) వ్యక్తిగతంగా తిరిగి చెల్లించాలని యూఎ్‌సలోని డెలావర్ కోర్టు రవీంద్రన్‌ను ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఈ నెల 20న వాదనలకు ఆస్కారం లేని డిఫాల్ట్ తీర్పును జారీ చేసింది. నిధుల మళ్లింపునకు సంబంధించిన ఈ కేసు విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలన్న ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..