BirlaNew Fiber Cement Board Plant: ఏపీలో బిర్లాన్యూ ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:01 AM
సీకే బిర్లా గ్రూప్ సంస్థ బిర్లాన్యూ... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కొత్తగా ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీర్ఘకాలిక...
తొలి దశలో రూ.127 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సీకే బిర్లా గ్రూప్ సంస్థ బిర్లాన్యూ... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కొత్తగా ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్లు బిర్లాన్యూ ఎండీ, సీఈఓ అక్షత్ సేథ్ వెల్లడించారు. తొలి దశలో రూ.127 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో తొలిసారిగా భారీ స్థాయి ఫైబర్ సిమెంట్ బోర్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏపీ మార్కెట్‌తో పాటు ప్రాంతీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తుందని పేర్కొంది. కాగా రెండో దశలో పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ కోసం అదనపు యూనిట్లను ఈ ప్లాంట్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు బిర్లాన్యూ తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..