BHEL Mega Contract: భెల్‌కు అదానీ పవర్ రూ.6,500 కోట్ల భారీ ఆర్డర్
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:53 AM
ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు అదానీ గ్రూప్ నుంచి రూ.6,500 కోట్ల విలువైన భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ కింద అదానీ పవర్ లిమిటెడ్...
ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు అదానీ గ్రూప్ నుంచి రూ.6,500 కోట్ల విలువైన భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ కింద అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) ఏర్పాటు చేసే థర్మల్ విద్యుత్ కేంద్రానికి భెల్ కీలక యంత్ర పరికరాలు సరఫరా చేయడంతో పాటు పర్యవేక్షణ సేవలు అందిస్తుంది. ఆర్డర్‌లో భాగంగా ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం కలిగిన ఆరు యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. భెల్‌కు ఒక దేశీయ కంపెనీ నుంచి ఇటీవల ఇంత పెద్ద ఆర్డర్ లభించడం ఇదే మొదటిసారి.