Bharat Biotech: భారత్ బయోటెక్‌తో బయోఫ్యాబ్రి జట్టు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:25 AM
క్షయ (టీబీ) వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు వ్యాక్సిన్లలో ఒకటైన ఎంటీబీవీఏసీ టెక్నాలజీ బదిలీకి సంబంధించి భారత్ బయోటెక్‌తో ....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): క్షయ (టీబీ) వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు వ్యాక్సిన్లలో ఒకటైన ఎంటీబీవీఏసీ టెక్నాలజీ బదిలీకి సంబంధించి భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వ్యాక్సిన్ తయారీ కంపెనీ బయోఫ్యాబ్రి ప్రకటించింది. ఎంటీబీవీఏసీ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలోకి చేరింది. దీనిపై 2022 సంవత్సరంలోనే ఉభయ సంస్థల మధ్య లైసెన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు టెక్నాలజీ బదిలీకి దాన్ని విస్తరించడంతో భారత్ బయోటెక్ ప్లాంట్లలో ఎంటీబీవీఏసీ తయారీకి మార్గం సుగమం అవుతుందని బయోఫ్యాబ్రి తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా భారత్ బయోటెక్ ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ తయారీకి, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో క్షయ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 70కి పైగా దేశాల్లో దాని పంపిణీకి భరోసా ఇస్తుంది.