జెనరేటివ్ ఏఐతో బ్యాంకింగ్‌కు మేలే
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:11 AM
జెనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భారత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలను కూడా షేక్ చేస్తోంది. దీని వినియోగంతో 2030 నాటికి ఫైనాన్షియల్ రంగం ఉత్పాదకత...

న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భారత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలను కూడా షేక్ చేస్తోంది. దీని వినియోగంతో 2030 నాటికి ఫైనాన్షియల్ రంగం ఉత్పాదకత 34 నుంచి 38 శాతం, బ్యాంకింగ్ రంగం ఉత్పాదక 46 శాతం మేర పెరగనుంది. ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ఖర్చులు తగ్గించుకుని, ఉత్పాదకత పెంచుకునేందుకు అనేక ఆర్థిక సేవల కంపెనీలు ప్రస్తుతం పెద్దఎత్తున జెన్ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో ఆ కంపెనీల కస్టమర్ ఎంగేజ్‌మెంట్, నిర్వహణా సామర్ధ్యం, నష్ట భయం (రిస్క్) మదింపు సామర్ధ్యాలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సేవలు, రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ, ఆటోమోటివ్, పరిశ్రమలు, ఇంధన రంగాలకు చెందిన 125 మంది కీలక అధికారులను సంప్రదించి ఈవై ఈ నివేదిక రూపొందించింది.