2026 Bank Holidays: తెలుగు రాష్ట్రాలకు వర్తించే బ్యాంక్ హాలిడేస్ ఇవే
ABN , Publish Date - Dec 31 , 2025 | 08:40 AM
రేపు కొత్త సంవత్సరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులో తెలుసుకోవడం తప్పనిసరి. దీంతో, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో కొత్త సంవత్సరంలోకి కాలుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సెలవుల జాబితాను వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి సెలవులతో పాటు ప్రధాన పండుగుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆదివారాలతో పాటు రెండవ, నాల్గవ శనివారాలు కూడా సెలవే. ఇక రాష్ట్రాల వారీగా కొన్ని ప్రత్యేక రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వీటిల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి (Bank Holidays 2026).
ఆర్బీఐ ప్రకారం తెలుగు రాష్ట్రాలకు వర్తించే సెలవులు
జనవరి: సంక్రాంతి(15వ తేదీ), రిపబ్లిక్ డే(26వ తేదీ)
ఫిబ్రవరి: ప్రత్యేక సెలవులు లేవు
మార్చ్: హోలీ (3వ తేదీ), ఉగాది (19వ తేదీ), రంజాన్, శ్రీరామనవమి (27వ తేదీ)
ఏప్రిల్: అకౌంట్స్ క్లోజింగ్ డే (1వ తేదీ), గుడ్ ఫ్రైడే (3వ తేదీ), డాక్టర్ అంబేడ్కర్ జయంతి (14వ తేదీ)
మే: మే డే(1వ తేదీ), బక్రీద్ (27వ తేదీ)
జూన్: మొహర్రం
జులై: ప్రత్యేక సెలవులు లేవు
ఆగస్టు: స్వాతంత్ర్య దినోత్సవం, మిలాద్ ఉన్-నబీ
సెప్టెంబర్: శ్రీకృష్ణ జన్మాష్టమి (4వ తేదీ), వినాయక చవితి (14వ తేదీ)
అక్టోబర్: గాంధీ జయంతి (2వ తేదీ), విజయదశమి (20వ తేదీ)
నవంబర్: గురునానక్ జయంతి, దీపావళి (8వ తేదీ, ఆదివారం)
డిసెంబర్: క్రిస్మస్ (25వ తేదీ)
అయితే, ఈ సెలవుల్లో నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్ , ఏటీఎం విత్‌డ్రాల వంటి డిజిటల్ సేవలన్నీ యథాప్రకారం అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు మూసి ఉన్నా వీటి ద్వారా ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలు యథాప్రకారం నిర్వహించుకోవచ్చు. పెద్ద లావాదేవీల విషయంలో బ్యాంకు సెలవులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ఇవీ చదవండి:
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..