Share News

Bajaj Auto Vice Chairman: పారిశ్రామికవేత్త మధుర్‌ బజాజ్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:09 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త మధుర్‌ బజాజ్‌ (73) అనారోగ్యంతో మృతి చెందారు. బజాజ్‌ ఆటో వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఆయన సియామ్‌ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు

Bajaj Auto Vice Chairman: పారిశ్రామికవేత్త మధుర్‌ బజాజ్‌ కన్నుమూత

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ ఆటో వైస్‌-చైర్మన్‌ మధుర్‌ బజాజ్‌ (73) అస్వస్థతతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం ఆయనను బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితం ఆయనకు స్ర్టోక్‌ కూడా వచ్చింది. శుక్రవారం తెల్లవారు ఝామున 5 గంటల సమయంలో ఆయన కన్ను మూసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మధుర్‌ బజాజ్‌ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల బోర్డు సభ్యుడుగా పని చేశారు. 2005-07 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన సియామ్‌ (భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం) అధ్యక్షుడుగా పని చేశారు.

Updated Date - Apr 12 , 2025 | 03:12 AM