Aro Realty Acquires Taj Banjara: అరో రియల్టీ చేతికి తాజ్ బంజారా
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:57 AM
స్థానిక అరబిందో గ్రూప్ రియల్టీ కంపెనీ అరో రియల్టీ, హైదరాబాద్‌లో మరో విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని తాజ్ బంజారా...
డీల్ విలువ రూ.315 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక అరబిందో గ్రూప్ రియల్టీ కంపెనీ అరో రియల్టీ, హైదరాబాద్‌లో మరో విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని తాజ్ బంజారా స్టార్ హోటల్‌ను రూ.315 కోట్లకు దక్కించు కుంది. మొత్తం 16,645 చదరపు గజాల్లో 1.2 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో ఈ స్టార్ హోటల్ ఉంది. జీహెచ్‌ఎంసీకి పన్నులు చెల్లించకపోవడంతో కొద్ది కాలంగా ఈ స్టార్ హోటల్ మూతపడి ఉంది. అరో రియల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రినొవేట్ చేసి స్టార్ హోటల్‌గా కొనసాగిస్తుందా లేక రియల్టీ వెంచర్‌గా మారుస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.