Arkin Gupta: ఫోర్బ్స్ అండర్ -30లో ఆర్కిన్ గుప్తా
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:34 AM
ఆర్థిక ఆవిష్కరణల్లో 30 ఏళ్లలోపు విజయ సాధకులకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన వార్షిక జాబితాలో భారత్‌కు చెందిన ఆర్కిన్ గుప్తాకు స్థానం లభించింది....
న్యూఢిల్లీ: ఆర్థిక ఆవిష్కరణల్లో 30 ఏళ్లలోపు విజయ సాధకులకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన వార్షిక జాబితాలో భారత్‌కు చెందిన ఆర్కిన్ గుప్తాకు స్థానం లభించింది. డేటా ఆధారిత పెట్టుబడి ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధిలో తన కృషితోపాటు ఆర్థిక ఉత్పత్తుల సృష్టిలో నాయకత్వ పాత్ర పోషించినందుకుగాను గుప్తాను ఈ జాబితాకు ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. పలు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) కంపెనీలతో కలిసి పనిచేస్తున్న గుప్తా.. తనకు దక్కిన ఈ గుర్తింపు ఆర్థిక సేవల రంగ నిర్ణయాల్లో సాంకేతికత, అనలిటిక్స్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను నిదర్శనమని అన్నారు.