Share News

Apollo Medskills: ఉజ్బెకిస్థాన్‌ జార్మెడ్‌ విశ్వవిద్యాలయంతో అపోలో మెడ్‌స్కిల్స్‌ జట్టు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:11 AM

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌నకు చెందిన అపోలో మెడ్‌స్కిల్స్‌ లిమిటెడ్‌.. ఉజ్బెకిస్థా న్‌కు చెందిన జార్మెడ్‌ విశ్వవిద్యాలయంతో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా...

Apollo Medskills: ఉజ్బెకిస్థాన్‌ జార్మెడ్‌ విశ్వవిద్యాలయంతో అపోలో మెడ్‌స్కిల్స్‌ జట్టు

  • భారతీయ విద్యార్ధులకు అందుబాటులోకి వైద్య విద్య

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌నకు చెందిన అపోలో మెడ్‌స్కిల్స్‌ లిమిటెడ్‌.. ఉజ్బెకిస్థా న్‌కు చెందిన జార్మెడ్‌ విశ్వవిద్యాలయంతో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా భారతీయ విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ‘జాప్‌ ఎంబీబీఎస్‌ ప్రొగ్రామ్‌’ ద్వారా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అపోలో మెడ్‌స్కిల్స్‌ సీఈఓ శ్రీనివాస్‌ రావు పులిజాల తెలిపారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులు భాషాపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వీరి కోసం ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమంలో అనుభవజ్ఞులైన భారతీయ అధ్యాపక బృందంతో విద్యను బోధించనున్నట్లు ఆయన చెప్పారు. ఉజ్బెకిస్థాన్‌లో జార్మెడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన రెండు క్యాంప్‌సలైన సమర్‌ఖండ్‌, బుఖారాల్లో ఎంబీబీఎస్‌ కోర్సు అందుబాటులో ఉంటుందని శ్రీనివాస్‌ తెలిపారు. అయితే జార్మెడ్‌ విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే విద్యార్ధులు నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎంబీబీఎస్‌ కోర్సును అపోలో మెడ్‌స్కిల్స్‌ డిజైన్‌ చేసిందని ఆయన వివరించారు. ఐదేళ్లు అకాడమిక్‌ కరిక్యులమ్‌తో పాటు ఒక సంవత్సరం హాస్పిటల్‌ అప్రెంటిషి్‌పను అందించనున్నట్లు ఆయన చెప్పారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్ధులు భారత్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు ఎఫ్‌ఎంజీఈ/నెక్ట్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తొలి ఏడాది నుంచే ఇందుకు సంబంధించి సమగ్ర శిక్షణను అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సు ఫీజు మొత్తం రూ.32 లక్షల వరకు ఉండనుందని శ్రీనివాస్‌ తెలిపారు

Updated Date - Jun 28 , 2025 | 04:13 AM