Employee Wage Increase: వచ్చే ఏడాది 9 శాతం వేతన వృద్ధి
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:23 AM
వచ్చే ఏడాది భారత్‌లో ఉద్యోగుల జీతాలు సగటున 9 శాతం పెరగవచ్చని ఏఓఎన్ నివేదిక అంచనా వేసింది. 2025లో నమోదైన 8.9 శాతం సగటు పెంపుతో పోలిస్తే వచ్చే ఏడాది...
ముంబై: వచ్చే ఏడాది భారత్‌లో ఉద్యోగుల జీతాలు సగటున 9 శాతం పెరగవచ్చని ఏఓఎన్ నివేదిక అంచనా వేసింది. 2025లో నమోదైన 8.9 శాతం సగటు పెంపుతో పోలిస్తే వచ్చే ఏడాది మరింత మెరుగైన హైక్ లభించనుందని అంటోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశీయంగా బలమైన వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు దోహదపడనున్నాయని నివేదిక పేర్కొంది. 45 రంగాలకు చెందిన 1,060 సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏఓఎన్ వెల్లడించింది.
ఉద్యోగుల వలసలు తగ్గుముఖం: కంపెనీల్లో ఉద్యోగుల వలసలు (అట్రిషన్) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని ఏఓఎన్ సర్వేలో వెల్లడైంది. 2023లో 18.7 శాతంగా ఉన్న వలసల రేటు 2024లో 17.7 శాతానికి, 2025లో 17.1 శాతానికి దిగివచ్చిందని రిపోర్టు తెలిపింది. ఉద్యోగుల వలసలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కంపెనీలు భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యం పెంపు శిక్షణ, డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్స్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఏఓఎన్ సర్వే నివేదికలో వెల్లడి
ఏ రంగంలో.. ఎంత(ు)
రియల్టీ/ఇన్‌ఫ్రా 10.9
ఎన్‌బీఎ్‌ఫసీ 10.0
ఇంజనీరింగ్ డిజైన్ సర్వీసెస్ 9.7
వాహన తయారీ, రిటైల్,
లైఫ్ సైన్సెస్ 9.6