Share News

Amazon Launches: డయాగ్నోస్టిక్స్‌ సేవల్లోకి అమెజాన్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:35 AM

ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా.. తన ఆరోగ్య సేవల విభాగాన్ని మరింత విస్తరించింది. ‘అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌’ పేరుతో హోమ్‌ సర్వీస్‌ సేవలను ఆదివారం ప్రారంభించింది.

Amazon Launches: డయాగ్నోస్టిక్స్‌ సేవల్లోకి అమెజాన్‌

  • ఇంటి దగ్గరే శాంపిల్స్‌ సేకరణ

  • హైదరాబాద్‌ సహా మరో ఐదు నగరాల్లో అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా.. తన ఆరోగ్య సేవల విభాగాన్ని మరింత విస్తరించింది. ‘అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌’ పేరుతో హోమ్‌ సర్వీస్‌ సేవలను ఆదివారం ప్రారంభించింది. వినియోగదారులు ఆరోగ్య పరీక్షల కోసం అమెజాన్‌ యాప్‌లో బుక్‌ చేసుకుంటే ల్యాబ్‌ టెక్నీషియన్లు ఇంటికే వచ్చి రక్తం లేదా ఇతర శాంపిల్స్‌ను తీసుకునేలా ల్యాబ్‌ టెస్టుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆరెంజ్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో అమెజాన్‌ ఈ సేవలను ప్రారంభించింది. అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌తో 800కి పైగా ఆరోగ్య పరీక్షలకు బుకింగ్స్‌, అపాయింట్‌మెంట్స్‌తో పాటు డిజిటల్‌ ఫార్మాట్‌లో రిపోర్టులను పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ సహా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా సహా 450కి పైగా పిన్‌కోడ్స్‌ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అమెజాన్‌ తెలిపింది.

Updated Date - Jun 23 , 2025 | 03:35 AM