Share News

Greenko Acquisition Deal: ఏఎం గ్రీన్‌ చేతికి ఓరిక్స్‌ కార్ప్‌ వాటా

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:32 AM

గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌ కంపెనీలో జపాన్‌కు చెందిన ఆర్థిక సర్వీసుల కంపెనీ ఓరిక్స్‌ కార్పొరేషన్‌కు గల 17.5శాతం వాటాను ఏఎం గ్రీన్‌ బీవీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ 128 కోట్ల...

Greenko Acquisition Deal: ఏఎం గ్రీన్‌ చేతికి ఓరిక్స్‌ కార్ప్‌ వాటా

  • గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌లో 17.5శాతం వాటా కొనుగోలు

  • డీల్‌ విలువ రూ.11,000 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌ కంపెనీలో జపాన్‌కు చెందిన ఆర్థిక సర్వీసుల కంపెనీ ఓరిక్స్‌ కార్పొరేషన్‌కు గల 17.5శాతం వాటాను ఏఎం గ్రీన్‌ బీవీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ 128 కోట్ల డాలర్లు (రూ.11,000 కోట్లు). గ్రీన్‌కో వ్యవస్థాపకులు అనిల్‌ చలమలశెట్టి, మహేశ్‌ కొల్లి ఇద్దరి యాజమాన్యంలోని సంస్థ ఏఎం గ్రీన్‌కు ఈ లావాదేవీ అనంతరం గ్రీన్‌కోలో 25శాతం వాటాలుంటాయి. గ్రీన్‌కోలో తనకు గల 20శాతం వాటాలో 17.5శాతంవాటాను ఏఎం గ్రీన్‌ పవర్‌ బీవీకి బదిలీ చేయడంతో పాటు దాని మాతృసంస్థ ఏఎం గ్రీన్‌ (లగ్జెంబర్గ్‌), సరళ్‌ (ఏఎంజీ లక్స్‌) జారీ చేసే కన్వర్టిబుల్‌ నోట్లలో 73.1 కోట్ల డాలర్లు (రూ.6,286.6 కోట్లు) ఓరిక్స్‌ కార్పొరేషన్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. గ్రీన్‌కో దేశంలో పునరుత్పాదక ఇంధన కంపెనీలను కలిగి ఉండడంతో పాటు 10 గిగావాట్ల స్థాపి త విద్యుత్‌ సామర్థ్యం కూడా కలిగి ఉంది. 2021 నుంచి గ్రీన్‌కో వ్యాపార వృద్ధికి ఓరిక్స్‌ మద్దతు ఇస్తోంది.

Updated Date - Jul 01 , 2025 | 02:33 AM