Share News

Allied Blenders: అలైడ్‌ బ్లెండర్స్‌ పెట్‌ బాటిల్స్‌ యూనిట్‌ ప్రారంభం

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:20 AM

తెలంగాణ వనపర్తి జిల్లాలోని రంగాపూర్‌ వద్ద ప్రముఖ దేశీయ మద్యం తయారీ కంపెనీ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌...

Allied Blenders: అలైడ్‌ బ్లెండర్స్‌ పెట్‌ బాటిల్స్‌ యూనిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ వనపర్తి జిల్లాలోని రంగాపూర్‌ వద్ద ప్రముఖ దేశీయ మద్యం తయారీ కంపెనీ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌ (ఏబీడీ) ఏర్పాటు చేసిన పెట్‌ బాటిల్స్‌ తయారీ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించింది. రూ.115 కోట్ల పెట్టుబడితో ఏటా 60 కోట్ల పెట్‌ బాటిల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఎండీ అలోక్‌ గుప్తా చెప్పారు. దీంతో తమ కంపెనీకి చెందిన అన్ని యూనిట్ల పెట్‌ బాటిల్స్‌ అవసరాలు తీరతాయన్నారు. రంగాపూర్‌లో కంపెనీ ఇప్పటికే ఒక డిస్టిలరీ, బాట్లింగ్‌ యూనిట్‌ను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సమగ్ర యూనిట్‌లో సింగిల్‌ మాల్ట్‌ ప్లాంట్‌ ఏర్పాటు కూడా పూర్తవుతుందన్నారు. దీంతో ప్రపంచంలో ఇదే తొలి సమగ్ర మద్యం తయారీ ప్లాంట్‌ అవుతుందని గుప్తా చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఏబీడీకి అతి పెద్ద మార్కెట్లన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 05:20 AM