All New Kia Seltos: అత్యాధునిక ఫీచర్లతో ఆల్ న్యూ సెల్టోస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:38 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలోని కియా పరిశ్రమలో అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త కియా సెల్టోస్ కార్ల ఉత్పత్తి ప్రారంభమయింది...
కియా ఫ్యాక్టరీలో తొలి కారు విడుదల
పెనుకొండ రూరల్ (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలోని కియా పరిశ్రమలో అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త కియా సెల్టోస్ కార్ల ఉత్పత్తి ప్రారంభమయింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గ్యాంగ్ లీ బుధవారం తొలి కారును ఆవిష్కరించారు. ఈ కారు జనవరి 2 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. కారు ధర కూడా అదే రోజు వెల్లడించనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కియా కారు కన్నా ఇది మరింత పెద్దదిగా, విశాలంగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలు, మరిన్ని డిజిటల్ ఫీచర్లు ఈ కారు ప్రత్యేకతలు. ఎస్‌యూవీల్లో పొడవైన కారుగా ఇది నిలుస్తుందని, గత వెర్షనన్లతో పోల్చితే ఎత్తు, పొడవు, వెడల్పు అన్నీ పెరగడంతో పాటు క్యాబిన్ స్పేస్ పెరిగి వెనుక సీట్లలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.