Share News

ఎయుర్‌టెల్‌ గూగుల్‌ బంఫర్‌ ఆఫర్‌

ABN , Publish Date - May 21 , 2025 | 02:47 AM

టెలికాం సంస్థ భారతి ఎయుర్‌టెల్‌, టెక్‌ దిగ్గజం గూగుల్‌ జట్టు కట్టాయి. ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్‌, వైఫై ఖాతాదారులకు గూగుల్‌ వన్‌ ద్వారా 100 జీబీ...

ఎయుర్‌టెల్‌ గూగుల్‌ బంఫర్‌  ఆఫర్‌

6 నెలల పాటు 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం

న్యూఢిల్లీ: టెలికాం సంస్థ భారతి ఎయుర్‌టెల్‌, టెక్‌ దిగ్గజం గూగుల్‌ జట్టు కట్టాయి. ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్‌, వైఫై ఖాతాదారులకు గూగుల్‌ వన్‌ ద్వారా 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ను ఆరు నెలల పాటు ఉచితంగా అందించనుంది. ఈ స్టోరేజ్‌ను గరిష్ఠంగా ఐదుగురితో పంచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆరు నెలల అనంతరం ఈ సబ్‌స్ర్కిప్షన్‌ కొనసాగించాలనుకునే కస్టమర్లు నెలకు రూ.125 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఒకవేళ సబ్‌స్ర్కిప్షన్‌ అవసరం లేదనుకుంటే గూగుల్‌ వన్‌ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:47 AM