Artificial Intelligence: ఉద్యోగాల్లో ఏఐకే పెద్దపీట
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:46 AM
దేశంలో ఉద్యోగ నియామకా ల ముఖచిత్రం మారిపోతోంది. ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా నూతన నియామకాల విషయంలో అభ్యర్థి...
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ నియామకా ల ముఖచిత్రం మారిపోతోంది. ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా నూతన నియామకాల విషయంలో అభ్యర్థికి కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల్లో పట్టు ఉందా, లేదా అని చూస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు నియామకాల సేవలందించే ‘ఇండీడ్’ తాజా నివేదికలో తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం గత నెల దేశీయ కంపెనీలు ప్రకటించిన ఉద్యోగాల్లో 11.7ు ఉద్యోగాలకు ఏఐ నైపుణ్యాలు కావాలని కోరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.5ు ఎక్కువ. ఈ ఏడాది జూన్‌తో పోల్చినా ఇది 1.1ు ఎక్కువ. సింగపూర్ తర్వాత భారతీయ కంపెనీలే కొత్త ఉద్యోగుల్లో ఏఐ నైపుణ్యాలను ఎక్కువగా చూస్తున్నట్టు ఇండీడ్ సంస్థ ఆసియా-పసిఫిక్ ప్రాంత సీనియర్ ఆర్థికవేత్త కాలమ్ పికరింగ్ చెప్పారు.
టెక్‌లోనే ఎక్కువ: ఉద్యోగుల్లో ఏఐ నైపుణ్యాలు కోరుతున్న కంపెనీల్లో టెక్ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. డేటా అండ్ అనలిటిక్స్ ఉద్యోగుల కోసం చూస్తు న్న కంపెనీల్లో 39ు కంపెనీలు ఏఐ నైపుణ్యాలు అడుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ అభి వృద్ధి (23ు), బీమా (18ు), శాస్త్రీయ పరిశోధన (17ు) కంపెనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది.
ఉద్యోగాలకు ముప్పే: మస్క్
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఉద్యోగాల్లో ఏఐ ప్రభావంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఐ, రోబోలు భవిష్యత్‌లో మనుషులు చేసే అన్ని ఉద్యోగాలను చేస్తాయన్నారు. అపుడు పనీ పాట లేని వ్యక్తులు కూరగాయలు పెంచుకుంటూ కాలక్షేపం చేయవచ్చంటూ సోషల్ మీడియా యాప్ ‘ఎక్స్,’ పోస్టులో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. టీసీఎస్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలు వేల మంది ఉద్యోగులకు తీసి వేస్తున్న సమయంలో మస్క్ పెట్టిన ఈ పోస్టు ఐటీ ఉద్యోగులను మరింత భయపెడుతోంది.