యూకే కంపెనీతో ఏజీఐ గ్లాస్‌ప్యాక్ ఒప్పందం
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:35 AM
గ్లాస్ ప్యాకేజింగ్ కంపెనీ ఏజీఐ గ్లాస్‌ప్యాక్.. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే గ్లాస్ ప్యూచర్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్లాస్ ప్యాకేజింగ్ కంపెనీ ఏజీఐ గ్లాస్‌ప్యాక్.. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే గ్లాస్ ప్యూచర్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద యూకే కంపెనీ తన అధునాతన పర్యావరణహిత గ్లాస్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌కు అందిస్తుంది. భారత్-బ్రిటన్ మధ్య ఇటీవల కుదిరిన ఎఫ్‌టీఏ నేపథ్యంలో బ్రిటన్‌లో తయారయ్యే స్కాచ్ విస్కీ పెద్దఎత్తున భారత్‌కు ఎగుమతి కానుంది. అయితే ఈ విస్కీని పూర్తిగా గాజు సీసాల్లోనే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏజీఐ గ్లాస్‌ప్యాక్ కంపెనీకి మరింత కలిసి రానుంది.